గ్లోబల్ స్టార్ ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ K’ లాంటి భారి బడ్జట్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న వైజయంతి మూవీస్, మంచి కథ ఉంటే మీడియం బడ్జట్ సినిమాలని కూడా ప్రొడ్యూస్ చేస్తూ హిట్ కొడుతుంది. జాతిరత్నాలు, సీతారమం సినిమాలు వైజయంతి నుంచి వచ్చి సూపర్ హిట్ అయిన లేటెస్ట్ సినిమాలు. ఇదే లిస్టులో చేరడానికి మే 18న రిలీజ్ అవుతుంది ‘అన్ని మంచి శకునములే’ సినిమా. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన నందినీ రెడ్డి ‘అన్ని మంచి శకునములే’ సినిమాని డైరెక్ట్ చేస్తుంది. అలా మొదలయ్యింది, ఓ బేబీ సినిమాలతో నందినీ రెడ్డి, ఫీల్ గుడ్ సినిమాలకి కేరాద్ అడ్రెస్ గా నిలిచింది. లేటెస్ట్ గా ‘అన్ని మంచి శకునములే’ సినిమా కూడా ఈ వేసవికి చల్లని చిరుగాలి అంటూ మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది.
వరల్డ్ ఆఫ్ AMS అంటూ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి లుక్ ని రివీల్ చేసిన మేకర్స్, ‘అన్ని మంచి శకునములే’ టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ కి తగ్గట్లే మంచి ఫీల్ ని క్యారీ చేసింది ఈ నిమిషమున్నర టీజర్. సంతోష్ శోభన్ ఫ్యామిలీ, మాళవిక నాయర్ ఫ్యామిలీలని పరిచయం చేసి, అక్కడి నుంచి హీరో-హీరోయిన్ మధ్య రిలేషన్ కి లైట్ గా టచ్ చేసి, ఒక యాక్సిడెంట్ తో టీజర్ ఎండ్ అయ్యింది. ఎమోషనల్ సినిమానేమో అని టీజర్ ని చూస్తుంటే సడన్ గా టీజర్ మధ్యలో జీప్ బ్లాస్ట్, జీప్ యాక్సిడెంట్ పెట్టి నందినీ రెడ్డి ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యాజికల్ గా ఉంది. ఇదే మ్యాజిక్ సినిమా మొత్తం ఉంటే అన్ని మంచి శకునములే మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో మరో హిట్ పడినట్లే.
ఈసారి వేసవికి చల్లని చిరుగాలి 🍃#TheWorldOfAMS Teaser: https://t.co/6ZjuBuAFyl#AnniManchiSakunamule In Theatres From May 18 💚@santoshsoban #MalvikaNair @nandureddy4u @MickeyJMeyer @KurapatiSunny @RIP_apart @SwapnaCinema @VyjayanthiFilms @MitravindaFilms @SonyMusicSouth pic.twitter.com/VHcocneWEV
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 4, 2023