బాహుబలితో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో రానా దగ్గుబాటి ఒకడు. ఆ సినిమాలో భల్లాలదేవగా రానా నటన అందరినీ ఆకట్టుకుంది. బాహుబలి తర్వాత రానాకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. అరణ్య, విరాటపర్వం, భీమ్లానాయక్… ఇలా వరుసగా రానా నటిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య విడుదల కాగా విరాటపర్వం, భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రోజు రానా బర్త్డే కావడంతో విరాటపర్వం సినిమా నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Read Also: రానా బర్త్డే స్పెషల్.. ‘భీమ్లానాయక్’ నుంచి మరో అప్డేట్
‘ద వాయిస్ ఆఫ్ రవన్న’ పేరుతో ఓ వీడియోను విడుదల చేయగా అందులో రానా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రానా సరసన సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మావోయిస్టు నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.