హీరో కృష్ణ నటిస్తున్న మరో ఇన్ ట్రస్టింగ్ మూవీ ‘ది టర్న్’. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కు చెందిన ఈ సినిమాను డీబీ దొరబాబు దర్శకత్వంలో భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో మనోహర్ వల్లెపు ,లడ్డు , అరుణ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా వాసంతి, రత్నమాల ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరో కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా నిర్మాత భీమినేని శివప్రసాద్ మాట్లాడుతూ, ”’ది టర్న్’ సినిమా కథ చాలా బాగుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మెచ్చే వారికి తప్పక నచ్చుతుంది. మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం” అని అన్నారు.