Gautham Vasudev Menon : ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ తెలుగు విడుదలకి కారణం ‘స్రవంతి’ రవికిశోర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శింబు హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ నిర్మించారు. దీనిని ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్. శనివారం ఈ సినిమా విడులైన సందర్భంగా తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది.

Also Read
- Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
- YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ‘ముందు తెలుగులోఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచన లేదు. ‘స్రవంతి’ రవికిశోర్ ఫోన్ చేశారు. పాటలు బావున్నాయి. ట్రైలర్ నచ్చింది. తెలుగులో కూడా విడుదల చేద్దాం అన్నారు. తమిళనాడులో ఒక పల్లెటూరిలో సినిమా కథ జరుగుతుంది. తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు ఏ ఊరు అయితే బావుంటుంది? హీరో మాట్లాడే యాస ఎలా ఉండాలి? అని రీసెర్చ్ చేశాం. నేను ఇంతకు ముందు తీసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. శింబుతో కంఫర్ట్ జోన్ ఉంది. సో… ఈజీగా చేశా. తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు వెల్లడిస్తా. రవికిశోర్ గారి నిర్మాణంలో రామ్ తో వచ్చే ఏడాది సినిమా చేస్తా’ అని అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘గౌతమ్ తో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. సినిమా చేయాలనుకుంటున్నాం. ఆ చర్చలో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ గురించి తెలిసింది. తమిళ వెర్షన్ విడుదలయ్యే వరకూ సినిమా చూడలేదు. బాగా నచ్చింది. ఇంతకు ముందు మా సంస్థ ద్వారా ‘నాయకుడు’, ‘పుష్పక విమానం’, ‘రెండు తోకల పిట్ట’, ‘రఘువరన్ బీటెక్’ చిత్రాలు విడుదల చేశాం. ఆ సినిమాల తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

హీరోయిన్ సిద్ధీ ఇధ్నానీ మాట్లాడుతూ ‘గౌతమ్ మీనన్ సినిమాలో కథానాయికగా నటించడం చాలా సంతోషంగా ఉంది. శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ సినిమా చేస్తున్నారని తెలిసి మా మేనేజర్‌కి పోస్టర్ స్క్రీన్ షాట్ పంపించా. నాకు అవకాశం వస్తుందని అనుకోలేదు. అవకాశం రావడంతో మాటలు రాలేదు. తెలుగులో కొన్ని సినిమాలు చేశా. గ్యాప్ తర్వాత ఈ సినిమాతో విజయం అందుకోవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!