Site icon NTV Telugu

Prabhas : ‘ది రాజాసాబ్’ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

The Rajasab

The Rajasab

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించినా.. చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్ లో కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయంట. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజ్ అప్డేట్ చెక్కర్లు కొడుతోంది. రాజాసాబ్ టీజర్ ను వచ్చే రెండు వారల్లోపు రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పటికే టీజర్ ను కట్ చేయించారంట డైరెక్టర్.
Read Also : Prabhas : ప్రభాస్ సినిమాలో క్రేజీ హీరోయిన్ కు ఛాన్స్..?

దీనికి ప్రభాస్ డబ్బింగ్ చెప్పడం ఒక్కటే పెండింగ్ లో పడిపోయింది. ఆయన ప్రస్తుతం హాలిడే టూర్ లో గడుపుతున్నారు. త్వరలోనే ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత డబ్బింగ్ కంప్లీట్ చేస్తే టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్. ఎట్టి పరిస్థితుల్లో రెండు వారాల్లో రిలీజ్ చేస్తారంట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్స్ రాక చాలా రోజులు అవుతోంది. ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేందుకే ఇలా ప్లాన్ చేస్తున్నారంట. ఇక నుంచి ఈ మూవీ అప్డేట్స్ వరుసగా ఇస్తారంట. దీన్ని హర్రర్ థ్రిల్లర్ సినిమాగా తీస్తున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదు. ఇందులో మాళవిక హీరోయిన్ గా చేస్తోంది.
Read Also : Mouni Roy : అర్ధరాత్రి నా రూమ్ లోకి రావాలని చూశాడు.. ప్రముఖ నటి కామెంట్స్

Exit mobile version