The Raja Saab: బర్త్​ డే స్పెషల్..‘రాజా సాబ్‘ నుంచి.. ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Rajasab

Rajasab

ఈ రోజు అక్టోబర్ 23, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఉదయం ఫౌజీ సినిమా నుండి ప్రత్యేక హైలైట్స్ వచ్చాయి, తాజాగా రాజా సాబ్ నుంచి మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ నుండి కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తుండగా.. పోస్టర్‌తో పాటు మేకర్స్ “హ్యాపీ బర్త్‌డే రేబల్ సాబ్” అని శుభాకాంక్షలు తెలుపుతూ, త్వరలో సినిమా నుంచి తొలి సింగిల్ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక సినిమాను ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా..  కామెడీ-హర్రర్ జాన్రా ఫీచర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాదు మేకర్స్ ప్రకారం, రాజాసాబ్ 2026 జనవరి 09న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. ఈ ప్రత్యేకమైన పోస్టర్ మరియు సింగిల్ విడుదలకు అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ చేస్తున్నారు.