గతంలో భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన దేశం లో తీవ్ర విషాదాన్ని నింపింది.. 1984 డిసెంబర్ 3 వ తేదీన జరిగిన ఈ గ్యాస్ లీకేజీ వేలాది మంది ప్రాణాలను బలిగొంది.అత్యంత మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటన ఆధారంగా ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.. ‘ది రైల్వే మెన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ వస్తోంది. మాధవన్, కేకే మీనన్, బాబిల్ ఖాన్ మరియు దివ్యేందు ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. శివ్ రావలి ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ టీజర్ అక్టోబర్ 28 న రిలీజ్ అయింది.భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన ను కళ్లకు కట్టేలా ‘ది రైల్వే మెన్’ టీజర్లో విజువల్స్ కనిపించాయి.. ఆద్యంతం ఎంతో ఆసక్తి పెంచే లా టీజర్ ఉంది. భోపాల్ దుర్ఘటన లో వేలాది మంది ప్రాణాలను కాపాడిన నలుగురు రైల్వే ఉద్యోగుల కృషి గురించి ఈ సిరీస్ రూపొందింది.
భోపాల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఈ ‘ది రైల్వే మెన్’ సిరీస్ తెరకెక్కింది. వాస్తవ ఘటన ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది.’ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ నవంబర్ 18 వ తేదీ న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. మొత్తం గా నాలుగు ఎపిసోడ్లు గా రిలీజ్ కానుంది.ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. “దేశాన్ని మొత్తం విషాదం లో నింపిన ఆ రాత్రి వేళ నలుగురు వీరులు అవిశ్రాంతం గా పోరాడారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన ‘ది రైల్వే మెన్’ నాలుగు ఎపిసోడ్ల లో నవంబర్ 18వ తేదీన వస్తోంది” అని నెట్‍ఫ్లిక్స్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ ను యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మించింది.