Site icon NTV Telugu

Kriti Sanon: ఓం రౌత్ ముద్దుపై చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీరియస్

Ttd

Ttd

Kriti Sanon: మొన్నటివరకు ఆదిపురుష్ సినిమా పరంగానే వివాదాలపాలైంది. ఇప్పుడు డైరెక్టర్ ఓం రౌత్ చేసిన పనివల్ల అది వ్యక్తిగతంగా కూడా వివాదంగా మారింది. గతరాత్రి ఆదిపురుష్ ఈవెంట్ ను ముగించుకొని ఉదయాన్నే డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ తిరుపతి స్వామివారిని దర్శించుకున్న విషయం తెల్సిందే. దర్శనం అనంతరం.. స్వామివారి ఆలయ ముంగిట కృతి సనన్ ను డైరెక్టర్ ఓం రౌత్ కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని బై చెప్పాడు. ఇక స్వామి ఆలయం ఎదుట ఏంటీ పాడు పనులు అంటూ నెటిజన్స్ ఉదయం నుంచి ఏకిపారేస్తున్న విషయం తెల్సిందే. కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన ఆలయంలో బాగోలేదని కామెంట్స్ పెడుతున్నారు. ఇక తాజాగా ఈ వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయప్రధాన అర్చకులు సీఎస్‌ రంగరాజన్ స్పందించారు. వారు చేసిన పని ఎంతో బాధ కలిగించిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సంఘటనలు ఇకముందు జరగకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

Adipurush: కీలక నిర్ణయం.. వారికి ‘ఆదిపురుష్’ టికెట్స్ ఉచితం

” తిరుమల కొండపైన .. ఆదిపురుష్ టీమ్ దర్శనం చేసుకున్నారు. అందుకు సంతోషం. దర్శనం అనంతరం సీత పాత్రలో నటించిన కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్ శేష వస్త్రం ధరించుకొని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం మనసుకు చాలా ఆందోళన కలిగించింది. ఎంతో పవిత్రమైన ఆ స్థలంలో వికారమైన చేష్టలు చేయకూడదు. శాస్త్ర సమ్మతమైనది కాదు. అక్కడ కొన్ని నియమాలు పాటించాలి. ఆలయ నియమం, ఆలోచన నియమం, భక్తికి నియమం.. మీ యొక్క ప్రవర్తనకు నియమం పాటించాలి. భార్యాభర్తలు కలిసి వచ్చినా కూడా, కొత్తగా అక్కడ పెళ్లి చేసుకున్న జంట కూడా తమ ప్రవర్తన నియమని పాటించి దూరంగా ఉంటారు. అలాంటి ప్రదేశంలో బహిరంగంగా కౌగిలించుకొని, బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం అనేది చాలా దారుణమైన కార్యక్రమం. మేమెప్పుడూ టీవీ ఛానెల్స్ ముందుకు రాము మాట్లాడడానికి.. కానీ, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారు రాముడి పాత్రలో చేసినప్పుడు ఎంతో హుందాతనంను ప్రదర్శించేవారు. అన్నమయ్య పాత్రలో నాగార్జున నటించినప్పుడు కూడా ఆయనకు దేవుడిపై నమ్మకం లేకపోయినా కూడా చాల హుందాతనంగా ప్రవర్తించారు. కానీ ఈ ప్రవర్తన చాలా నిందనీయం అయిన విషయం. దయచేసి.. టీటీడీ వారికి చెప్పేది ఒకటే.. సినీ సెలబ్రిటీలు వస్తే వీఐపీ దర్శనం చేయించండి కానీ.. ఇలాంటి వికార చేష్టలు చేయకుండా వారిపై నిఘా ఉంచండి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version