#90’s: ఈ మధ్యకాలంలో ఓటిటీలో వచ్చిన ఏదైనా మంచి సిరీస్ ఉంది అంటే అది #90’s మిడిల్ క్లాస్ బయోపిక్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా.. నవీన్ మేడారం నిర్మించాడు. జనవరి 5 న ఈ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సిరీస్ మొత్తం ఎంతో అద్భుతంగా ఉంది. 90 ల్లో ఒక మిడిల్ క్లాస్ తండ్రి.. తన కుటుంబాన్ని, పిల్లలను ఎలా చూసుకున్నాడు అనేది కథగా చూపించారు. ముఖ్యంగా బాల నటుడు రోహన్ కు మంచి పేరు వచ్చింది. ఆదిత్య పాత్రలో అతడి నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. చదువు విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో చురుగ్గా ఉండడం, తండ్రిని కూడా ఏడిపించడం, తల్లిని ఫుడ్ వండమని బెదిరించడం.. ఆమె కోపంగా ఉంటే సైలెంట్ గా సైడ్ అయిపోవడం, అన్నతో ఎన్ని గొడవలు పడినా.. అతడు బాధల్లో ఉంటే ఓదార్చడం.. బంధువులు వస్తే డబ్బులు తీసుకోవడానికి ప్లాన్ చేయడం.. ఒకటని కాదు.. సిరీస్ మొత్తం ఆదిత్య లేకపోతే వేరేలా ఉండేది అని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా ఆదిత్య ఓవర్ యాక్షన్ చేసినప్పుడల్లా.. వెనుక ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తూఉంటుంది. “సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూస అని.. నా.. నానా” అంటూ సాగే ఈ చిన్న మ్యూజిక్ బిట్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ రిలీజ్ అయ్యినప్పటినుంచి ఈ మ్యూజిక్ ను రింగ్ టోన్ గా పెట్టుకోవడానికి చాలామంది ట్రై చేశారు. ఎట్టకేలకు ఈటీవీ విన్.. ఆ ఫెసిలిటీని కల్పించింది. ఈ మ్యూజిక్ ను రింగ్ టోన్ గా మార్చి.. సోషల్ మీడియాలో లింక్ ఇచ్చింది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుంటే చాలు.. రింగ్ టోన్ సెట్ అయిపోయినట్టే..
The most awaited ringtone is out now💥🚀 Ringtone version
🔗 : https://t.co/lvTTjfxbF7 pic.twitter.com/YBjSoqKUEX— ETV Win (@etvwin) January 18, 2024