మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5లో రానున్న లేటెస్ట్ మూవీ ‘ది మార్వెల్స్’. దీపావళి కానుకగా నవంబర్ 10న ‘ది మార్వెల్స్’ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్, ఫన్, అడ్వెంచర్ కలిసిన ఈ మూవీలో ‘కెప్టెన్ మార్వెల్’, ‘కమలా ఖాన్’, ‘మోనికా’ క్యారెక్టర్స్ కలిసి కనిపించనున్నాయి. ఈ ముగ్గురిని టీం అప్ చేసే క్యారెక్టర్ లో ‘నిక్ ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ నటిస్తున్నాడు. అవెంజర్స్ అంటేనే టీం గేమ్, అలాంటిది మొదటిసారి ఉమెన్ పవర్ చూపిస్తూ ఈ సూపర్ హీరోస్ కలిసి నటించడంతో ‘ది మార్వెల్స్’ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ MCUకి పూర్వ వైభవం తీసుకోని రాలేకపోతున్నాయి. ఇప్పుడు నవంబర్ 10న రిలీజ్ కానున్న ది మార్వెల్స్ సినిమా అయినా MCU ఫేజ్ 5లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ది మార్వెల్స్ సినిమాకి ఇండియా నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదురవుతుంది. ది మార్వెల్స్ రిలీజ్ అయ్యే రోజునే బాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్, మచ్ అవైటెడ్ టైగర్ 3 రిలీజ్ అవుతోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కలిసి నటిస్తున్న టైగర్ 3 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి నెక్స్ట్ వెయ్యి కోట్ల సినిమా టైగర్ 3 అని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. టైగర్ 3 కారణంగా ది మార్వెల్స్ సినిమాకి నార్త్ లో థియేటర్స్ ఎక్కువగా దొరికే అవకాశం లేదు. అలానే ది మార్వెల్స్ సినిమా వలన టైగర్ 3 ఓవర్సీస్ లో ఇబ్బంది పడనుంది. మరి ఈ క్లాష్ లో టైగర్ గెలుస్తుందా? లేక ది మార్వెల్స్ గెలుస్తారా అనేది చూడాలి.
Renegade ⭐ Hero 🌟 Avenger 💫
Experience the return of Captain Marvel in #TheMarvels, only in theaters November 10. Get tickets now. https://t.co/fHJB2N2Cj0 pic.twitter.com/m9ZI9WZetM
— Marvel Studios (@MarvelStudios) October 25, 2023