Site icon NTV Telugu

Adah Sharma: అదా శర్మకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!

Adah Sharma

Adah Sharma

Actress Adah Sharma Got Hospitalised Due To Diarrhoea:’ది కేరళ స్టోరీ’ లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ఆదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఇప్పుడు తాజాగా అదా శర్మ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆదా శర్మ ఆసుపత్రిలో చేరింది వాస్తవమే అని తెలుస్తోంది, వాస్తవానికి, నటి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారని అంటున్నారు. మంగళవారం నాడు ఆమె తాను నటించిన ఒక సినిమాను ప్రమోట్ చేస్తున్న సమయంలో, పరిస్థితి అకస్మాత్తుగా విషమించడంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఈ రోజు అదా శర్మ కమాండోను ప్రమోట్ చేయడానికి ఇంటర్వ్యూలు చేస్తుండగా ఫుడ్ అలర్జీ, వాంతులు – విరేచనాల కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరిందని తెలుస్తోంది.

Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్‌ ప్రైవేట్‌ వీడియోలు లీక్‌.. అతని పనేనంటూ కేసు నమోదు!

అనారోగ్య కారణాల వల్ల ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ఆదా శర్మ బృందం అధికారిక సమాచారం ఇచ్చింది. ఆదా శర్మకు సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం చాలా ఒత్తిడితో పని చేస్తున్న కారణంగా ఆమెకి డయేరియా వచ్చిందని, ఆ కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఆదా త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెబ్ సిరీస్ కమాండోలో కనిపించనుంది. ఇందులో ఆమె భావనారెడ్డి అనే పాత్రలో నటిస్తోంది. .మరోసారి ఆమె యాక్షన్‌తో పాటు కామెడీ కూడా చేస్తుందని భావిస్తున్నారు.

Exit mobile version