NTV Telugu Site icon

Project K: ఇండియా టు అమెరికా వయా జపాన్… ది హైప్ ఈజ్ రియల్

Projectk

Projectk

టాలీవుడ్ అయిపోయింది.. బాలీవుడ్ అయిపోయింది.. పాన్ ఇండియా అయిపోయింది.. ఇక హాలీవుడ్‌ని ఏలడానికి బయల్దేరాడు రెబల్ స్టార్ ప్రభాస్. అమెరికా నుంచి బయటికొచ్చిన ఓ ఫోటోలో.. హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా.. హాలీవుడ్ హోర్డింగ్ ముందు నిల్చున్న ప్రభాస్ కటౌట్‌ని చూసి.. ఇక హాలీవుడ్‌ని ఏలేయ్ డార్లింగ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి కొన్ని నిమిషాల్లో రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ K’ మూవీ టైటిల్‌, ఫస్ట్ గ్లింప్స్‌ను అమెరికా శాన్ డియాగో కామిక్ కాన్ వేదిక పై రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో జులై 20, ఇండియాలో 21న ప్రాజెక్ట్ కె గ్లింప్స్ బయటికి రానుంది. ఈ ఈవెంట్‌లో ఎంట్రీ ఇస్తున్న తొలి ఇండియన్ మూవీగా ‘ప్రాజెక్ట్ K’ చరిత్ర సృష్టించనుంది. దీనికోసమే.. ప్రభాస్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. రానా కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు.

శాన్ డియాగోలో ప్రభాస్, రానా ల్యాండ్ అయ్యారంటూ ఓ ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది చిత్ర యూనిట్. అలాగే.. విలన్‌గా నటిస్తున్న కమల్ హాసన్ కూడా అమెరికా నుంచి గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఇక ప్రభాస్ దెబ్బకు అమెరికాలో విధ్వంసం వచ్చినట్టే రచ్చ చేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్. భారీగా కార్లతో ర్యాలీలు నిర్వహిస్తూ.. ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ప్రాజెక్ట్ కె కార్ల ర్యాలీలే కనిపిస్తున్నాయి. ఒక్క అమెరికానే కాదు.. జపాన్‌ ఫ్యాన్స్‌ కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. జపనీయులు ప్రాజెక్ట్ కె యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. బాహుబలితో వరల్డ్ వైడ్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అందుకే..  ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ప్రాజెక్ట్‌ కె గ్లింప్స్‌ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ప్రాజెక్ట్‌ కెతో ప్రభాస్ హాలీవుడ్‌లో జెండా పాతేస్తాడేమో చూడాలి.