Project K: ఇండియా టు అమెరికా వయా జపాన్… ది హైప్ ఈజ్ రియల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అయిపోయింది.. బాలీవుడ్ అయిపోయింది.. పాన్ ఇండియా అయిపోయింది.. ఇక హాలీవుడ్‌ని ఏలడానికి బయల్దేరాడు రెబల్ స్టార్ ప్రభాస్. అమెరికా నుంచి బయటికొచ్చిన ఓ ఫోటోలో.. హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా.. హాలీవుడ్ హోర్డింగ్ ముందు నిల్చున్న ప్రభాస్ కటౌట్‌ని చూసి.. ఇక హాలీవుడ్‌ని ఏలేయ్ డార్లింగ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి కొన్ని నిమిషాల్లో రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ K’ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను అమెరికా శాన్ డియాగో కామిక్ కాన్ వేదిక పై రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో జులై 20, ఇండియాలో 21న ప్రాజెక్ట్ కె గ్లింప్స్ బయటికి రానుంది. ఈ ఈవెంట్‌లో ఎంట్రీ ఇస్తున్న తొలి ఇండియన్ మూవీగా ‘ప్రాజెక్ట్ K’ చరిత్ర సృష్టించనుంది. దీనికోసమే.. ప్రభాస్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. రానా కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు.
శాన్ డియాగోలో ప్రభాస్, రానా ల్యాండ్ అయ్యారంటూ ఓ ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది చిత్ర యూనిట్. అలాగే.. విలన్‌గా నటిస్తున్న కమల్ హాసన్ కూడా అమెరికా నుంచి గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఇక ప్రభాస్ దెబ్బకు అమెరికాలో విధ్వంసం వచ్చినట్టే రచ్చ చేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్. భారీగా కార్లతో ర్యాలీలు నిర్వహిస్తూ.. ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ప్రాజెక్ట్ కె కార్ల ర్యాలీలే కనిపిస్తున్నాయి. ఒక్క అమెరికానే కాదు.. జపాన్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. జపనీయులు ప్రాజెక్ట్ కె యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. బాహుబలితో వరల్డ్ వైడ్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అందుకే.. ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ప్రాజెక్ట్ కె గ్లింప్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ప్రాజెక్ట్ కెతో ప్రభాస్ హాలీవుడ్‌లో జెండా పాతేస్తాడేమో చూడాలి.
Also Read
- Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
- Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
తాజావార్తలు
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!