The Grate Indian Suicide Trailer: చనిపోయినవాడిని బతికించడానికి మాస్ సూసైడ్.. ఆరుగురు ఒకేసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Grate Indian Suicide Trailer: రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. గతేడాది తెలిసినవాళ్ళు అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకు టైటిల్ చేంజ్ చేసి ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ గా మార్చారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 6 న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది దేశం మొత్తం షేక్ చేసిన మాస్ సూసైడ్ గురించి అందరికి తెలిసిందే. చనిపోయిన తండ్రి బతికి వస్తాడని మూఢనమ్మకంతో ఒక కుటుంబం మొత్తం మాస్ సూసైడ్ చేసుకొని మృతిచెందింది. ఈ సంఘటన ఆధారంగా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. ఇక ఈ స్టోరీ కూడా దాదాపు అలానే ఉందని ట్రైలర్ ను బట్టి చెప్పొచ్చు. హెబ్బా పటేల్ ది ఉమ్మడి కుటుంబం. పెదనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న, తమ్ముడు.. ఇక ఒక కారు ప్రమాదంలో పెద్దనాన్న అయిన నరేష్ చనిపోతాడు. అప్పటినుంచి ఆ కుటుంబంలో మనశ్శాంతి కరువవుతుంది. నిత్యం నరేష్ .. నన్ను బతికించండి అంటూ ఇంట్లోవారికి చెప్తున్నట్లు చూపించారు.
Thalaivar170: ఏందయ్యా ఇది.. సినిమా తీస్తున్నారా.. స్టార్ క్యాంపైన్ చేస్తున్నారా.. ?
Also Read
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
ఇక ఇంకోపక్క హెబ్బాను రామ్ కార్తీక్ ప్రేమిస్తాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న తరుణంలో పెద్దనాన్న చనిపోతాడు. ఇక ఆ కుటుంబం మొట్ట పూజలు చేయించి.. నరేష్ బతికి రావాలంటే.. ఇంట్లో ఉన్నవారందరూ కలిసి కట్టుగా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పడంతో రామ్ కార్తీక్ షాక్ అవుతాడు. తనకు ఇష్టం లేకున్నా.. ఆ కుటుంబాన్ని కాపాడడానికి అతను కూడా ఆత్మహత్య చేసుకోవడంలో భాగమవుతాడు. అయితే చివరికి ఈ మాస్ సూసైడ్ ను అతను ఆపాడా.. ? లేక వారితో పాటు అతను చనిపోయాడా.. ? ఈ మూఢ నమ్మకం వెనుక ఉన్న అసలు హస్తం ఎవరిది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఇందులో నరేష్ – పవిత్ర మరోసారి జంటగా కనిపించారు. హెబ్బా తన నటనతో ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ల్ ను కలిగిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!