Site icon NTV Telugu

Kollywood : ఆ ఇద్దరి స్టార్ హీరోయిన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుందట

Trisha Vs Nayanatara

Trisha Vs Nayanatara

నయనతార, త్రిషల మధ్య వైరం క్లోజ్ కాలేదన్నది ఓపెన్ సీక్రెట్. చెన్నై సుందరి వదిలేసిన ప్రాజెక్టుతో నయనతార హిట్ కొట్టడం, లేడీ సూపర్ స్టార్ క్విటైన సినిమాలో త్రిష యాక్ట్ చేసి ప్లాప్ మూటగట్టుకోవడం ఆపై రోస్టింగ్‌కు గురవ్వడం చూస్తే సైలెంట్ వార్ ముగియనట్లే కనిపిస్తోంది. 40 ప్లస్‌లో కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా సినిమాలకు కమిటవ్వడం, రెమ్యునరేషన్ విషయాల్లోనూ పోటీపడుతుండటం కూడా డౌట్స్ కలిగిస్తున్నాయి.

Also Read : HHVM : మైత్రీ, దిల్ రాజు ఔట్.. నైజాంలో ఓన్ రిలీజ్ కు నిర్మాత రెడీ

త్రిష, నయనతార మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నదన్నది ఇప్పటి మాట కాదు. విజయ్ దళపతి కురువి మూవీ నుండే ఈ ఇద్దరి మధ్య స్నేహం చెడిందని టాక్. ఈ సినిమా కోసం ఫస్ట్ నయనతారకు ఆఫర్ చేస్తే గద్దలా తన్నుకుపోయిందట త్రిష. అప్పుడు స్టార్టైన వీరి మిని సంగ్రామం ఇప్పుడు చిలికి చిలికి వానలా మారినట్లు తెలుస్తోంది. మూకుత్తి అమ్మన్ కోసం త్రిషను ఫస్ట్ ఆర్జే బాలాజీ సంప్రదిస్తే ఆమె కాదనడంతో లేడీ సూపర్ స్టార్ వద్దకు చేరగా సూపర్ హిట్ అయింది. అలాగే థగ్ లైఫ్‌లో నయన్ అనుకున్నాడట మణిరత్నం. మేడమ్ నో చెప్పడంతో త్రిష నటించి డిజాస్టర్ అందుకుంది.  నయన్ ప్రజెంట్ దాదాపు పది సినిమాలు చేస్తోంది. కానీ త్రిష ప్లాప్స్ తో కెరీర్ డ్యామేజ్ చేసుకుంటుంది. అయితే రీసెంట్లీ 1990లో వచ్చిన ఆదివెల్లి అనే సినిమాను రీమేక్ చేయాలని ఓ నిర్మాత నయన్‌ను అడిగితే  ఏకంగా రూ. 15 కోట్లు అడిగిందట. దీంతో త్రిషతో చర్చిస్తున్నారని టాక్. ఆమె కూడా ఇలాంటి కథలో నటించడానికి ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. ఇలా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నువ్వా నేనా అని పోటీపడుతున్నారు.

Exit mobile version