‘తరగతి గది దాటి’ వినోదం పంచుతున్న ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పెళ్ళిగోల’ ఫేమ్ మల్లిక్ రామ్ రూపొందించిన తాజా వెబ్ సీరిస్ ‘తరగతి గది దాటి’. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో నిర్మితమైన ఈ వెబ్ సీరిస్ టీవీఎఫ్ ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’కు రీమేక్. టీనేజ్ రొమాన్స్ ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న దీని ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ ప్రేమకథ సాగుతుంది. దాంతో తెలుగు నేటివిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గోదావరి, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోని జీవనాన్ని ఇది తెలియజేస్తోంది. కిట్టు తల్లిదండ్రులైన శంకర్, గౌరి ఓ కోచింగ్ సెంటర్‌ను నడుపుతుంటారు. కృష్ణకు లెక్కలంటే చాలా ఇష్టం. విద్యార్థిగా మంచి తెలివితేటలుంటాయి. కానీ చదువుపై దృష్టి పెట్టడు. వాళ్ల కోచింగ్ సెంటర్లో జాస్మిన్ అనే అమ్మాయి జాయిన్ అయిన తర్వాత అతని ప్రపంచం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ఈ వెబ్ సీరిస్ కథ. తాజాగా విడుదలైన ట్రైలర్ లో పంచ్ డైలాగ్స్ తో పాటు టీనేజ్ లవ్ కూ పెద్ద పీట వేశారు. ఈ నెల 20న ఐదు ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సీరిస్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Also Read
- Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
- SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా 'బ్రాండ్ న్యూ డే’
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
తాజావార్తలు
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!