Raja Deluxe మూవీపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్లలో ఇకపై చిన్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు రెబల్ స్టార్. ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి విరామం లేకుండా పని చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో Raja Deluxe చిత్రానికి ఇటీవలే సంతకం చేశారు. ఇక ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్లలో పూర్తి చేయబోతున్నారట. హారర్-కామెడీ కలయికలో కథాంశంతో రూపొందిన ఈ సినిమా కోసం ప్రభాస్ 50 రోజులు కేటాయించాడు. మేలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మారుతీ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి యంగ్, టాప్ కంపోజర్ ఎంపికైనట్లు తెలుస్తోంది.
Read Also : Radheshyam : హిలేరియస్ మీమ్ షేర్ చేసిన తమన్
“రాజా డీలక్స్” అనే తాత్కాలిక టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. ప్రభాస్ తాజా చిత్రం “రాధే శ్యామ్”కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక “రాజా డీలక్స్”లో మాళవిక మోహనన్, శ్రీ లీలలను హీరోయిన్స్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని, అందుకోసం కోసం చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మూడవ హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో విలాసవంతమైన సెట్‌ను నిర్మించారు. ఎక్కువ భాగం షూటింగ్ సెట్లో పూర్తవుతుంది. Raja Deluxe చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారు.