Site icon NTV Telugu

Sarkaru Vaari Paata : సాలిడ్ అప్డేట్ ఇచ్చిన తమన్

SVP

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” మార్చి 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ యొక్క జాయింట్ వెంచర్ సంయుక్తంగా నిలుస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్ ను షేర్ చేశారు తమన్.

Read Also : Pawan Kalyan: భీమ్లా నాయక్ వచ్చేశాడు.. అందరికీ నచ్చేశాడు..!!

సంచలనాత్మక సంగీత స్వరకర్త సోషల్ మీడియాలో పరశురామ్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో పాటు తదుపరి పాట కోసం సన్నాహాలు చేస్తున్నామని చెబుతూ “కళావతి” పాటను చార్ట్‌బస్టర్‌గా నిలిపిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ తాజా అప్‌డేట్‌తో మహేష్ బాబు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందించిన మరో పాట కోసం ఎదురు చూస్తున్నారు.

Exit mobile version