Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Thalapathy Vijay Tamil Nadu Cm Jana Nayagan Release Date

CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Published Date :May 10, 2026 , 2:54 pm
By Shiva Ganesh
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM Vijay: తమిళనాడు రాజకీయ చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తమిళ సూపర్ స్టార్ ‘దళపతి’ విజయ్ మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ తన కుటుంబ సభ్యులతో పాటు, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కళగం) నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా వచ్చి విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

డ్యాషింగ్ లుక్‌లో సీఎం
ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే విజయ్, తన ప్రమాణ స్వీకార వేడుక కోసం సంప్రదాయ దుస్తులకు భిన్నంగా ఫార్మల్ బ్లాక్ సూట్ – ప్యాంట్ ఎంచుకున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఆయన ఎంతో హుందాగా కనిపించారు. వెండితెరపై దళపతిగా అలరించిన విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో ప్రజా నాయకుడిగా తన కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకలో నటి త్రిష కృష్ణన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి హాజరైన త్రిష.. చీర కట్టుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా కనిపించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తుంటే ఆమె ఎంతో ఉత్సాహంగా కనిపించారు. కార్యక్రమం అనంతరం విజయ్ వారిని కలిసి ముచ్చటించారు.

Also Read

  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
  • Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
  • P. Bharat Bhushan: ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్..
  • Jananayagan : జననాయగన్ రిలీజ్ అయితే రూ.1000 కోట్లు పక్కా
Add as a preferred
source on google

బాలనటుడి నుంచి బ్లాక్ బస్టర్ స్టార్ వరకు..
విజయ్ సినీ ప్రస్థానం తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో బాలనటుడిగా స్టార్ట్ అయ్యింది. 1992లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా దళపతి, 1994లో వచ్చిన ‘రసిగన్’ సినిమాతో తొలి హిట్ అందుకుని ‘ఇళయ దళపతి’గా అభిమానుల్లో గుర్తింపు పొందారు. 2003 తర్వాత వరుస విజయాలతో కోలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదిగారు. 2017లో ‘మెర్సల్’ సినిమాతో ‘దళపతి’గా మారిన విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలకు దీటుగా తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు.

‘జన నాయగన్’ కోసం ఎదురుచూపులు..
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో విజయ్ నటించిన లాస్ట్ మూవీగా ప్రచారంలో ఉన్న ‘జన నాయగన్’ రిలీజ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజూ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గత ఐదు నెలలుగా రిలీజ్‌ కాకుండా ఆగిపోయింది. నిజానికి ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే తమిళనాడులో సీఎంగా విజయ్ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో, ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్‌ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jana Nayagan censor issues
  • Jana Nayagan Movie Release Date
  • Tamil Nadu CM Vijay Swearing-in
  • Thalapathy 69 Updates
  • Thalapathy Vijay CM

తాజావార్తలు

  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

  • Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?

  • PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..

  • CSK vs LSG: నేడు చెపాక్‌లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్‌లో అయిన ధోనీ ఉంటాడా?

  • IPL 2026: ఆర్‌సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions