CSK vs LSG: నేడు చెపాక్‌లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్‌లో అయిన ధోనీ ఉంటాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK vs LSG: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశలో భాగంగా ఆదివారం (మే 9) చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగనున్న పోరు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. ఇక, పట్టికలో అట్టడుగున ఉన్న ఎల్ఎస్జీకి ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌గా మారింది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ సీఎస్కేకి కలిసివచ్చే అంశం. ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో సంజూ శామ్సన్ అద్భుత ఫామ్‌లో ఉండటం, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి ఫామ్‌లోకి రావడం చెన్నైకి కలిసొచ్చే అంశాలు. అయితే, కొంత మంది అభిమానులు సైతం సీజన్లో అంత సంతోషంగా కనిపించడం లేదు. దానికి కారణం ఎంఎస్ ధోనీ. మిస్టర్ కూల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిక్క గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ, ఈ మ్యాచ్‌లోనైనా బరిలోకి దిగుతాడా అనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. రూ. 27 కోట్ల భారీ ధర పలికిన కెప్టెన్ రిషబ్ పంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం జట్టుకు కలిసి రావడం లేదు. అయితే, గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీ (111) సాధించి ఆరు వరుస ఓటములకు చెక్ పెట్టడం లక్నోలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బౌలింగ్‌లో మహమ్మద్ షమీపై ఆ జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక, నేటి చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో నూర్ అహ్మద్, అకీల్ హుస్సేన్ వంటి స్పిన్నర్లతో చెన్నై పైచేయి సాధించాలని భావిస్తోంది. అనుభవం ఉన్న చెన్నైని వారి సొంత గడ్డపై లక్నో ఎంతవరకు అడ్డుకుంటుందో చూడాలి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Chennai Super Kings: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రూయిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రామకృష్ణ ఘోష్, ఆయుష్ మ్హత్రే, శ్రేయస్ గోపాల్, జామీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ చౌద్ సింగ్, ముఖేషల్ చౌద్ సింగ్, ఎ. ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాచరీ ఫౌల్క్స్, స్పెన్సర్ జాన్సన్, కార్తీక్ శర్మ, అమన్ ఖాన్.
Lucknow Super Giants: రిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, అక్షత్ రఘువంశీ, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, హిమ్మత్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఐడెన్ మర్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్, జార్జ్బా మర్షిన్కర్ని, జార్జ్ మర్షిన్కర్ని, ఎమ్చెల్కౌల్డే), అహ్మద్, ఆకాష్ సింగ్, అవేష్ ఖాన్, మహ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, మణిమారన్ సిద్ధార్థ్, అర్జున్ టెండూల్కర్, నమన్ తివారీ, మయాంక్ యాదవ్.
తాజావార్తలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!