సోషల్ మీడియాని హైజాక్ చేసి దళపతి విజయ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘గిల్లీ’ రీరిలీజ్ అవుతుంది అనే వార్త బయటకి వచ్చింది. రీరిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంలో కూడా క్లారిటీ రాలేదు కానీ రిలీజ్ అవుతుంది అనే విషయం తెలియగానే సోషల్ మీడియాలో గిల్లీ, విజయ్, దళపతి ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తూ మంచి జోష్ లో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాకి రీమేక్ గా గిల్లీ తెరకెక్కింది. ఇక్కడ భూమిక హీరోయిన్ గా నటించగా… తమిళ్ లో త్రిష హీరోయిన్ గా నటించింది. గిల్లీ సినిమా విజయ్ కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సినిమానే విజయ్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. అందుకే విజయ్ ఫ్యాన్స్ అందరికీ గిల్లి చాలా స్పెషల్ సినిమా. ఈ మూవీ రీరిలీజ్ డేట్ ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే విజయ్ ఫ్యాన్స్ కి గోట్ రిలీజ్ డేట్ కూడా కిక్ ఇస్తోంది.
వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేస్తున్న విజయ్. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు… యువన్‌శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, లైలా వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… ఈ సినిమాను రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ముందునుంచి వినిపించినట్టుగా… జూన్ 13న గోట్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాల మాట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఈ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది అనే విషయం తెలియడంతో అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం విజయ్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరి మేకర్స్ నుంచి ఒక సాలిడ్ పోస్టర్ తో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.