Thalaimai Seyalagam: ఆసక్తిరేపుతున్న శ్రియా రెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ ‘తలమై సెయలగమ్’ తెలుగు ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalaimai Seyalagam Official Telugu Trailer: ZEE5 ఇప్పటికే పలు భాషల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్రమంలో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే తమిళంలో ట్రైలర్ రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా తెలుగు ట్రైలర్‌ను జీ 5 విడుదల చేసింది. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ రూపొందినట్టు క్లారిటీ వచ్చేసిన్నది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై జాతీయ అవార్డ్ గ్రహీత వసంతబాలన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్ రూపొందించారు. ఈ సిరీస్ లో కన్నడ కిషోర్, శ్రియారెడ్డి, ఆదిత్య మీనన్, భరత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడులో రాజకీయాల మధ్య ఒక మహిళ అధికార దాహం, ఆశయం, ద్రోహం, విమోచనలను తెలియజేసే కథాంశంతో ఇది తెరకెక్కిందని అర్ధం అవుతోంది.
Director Died: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి
Also Read
ఇది తమిళ రాజకీయాల చుట్టూ నడిచే కథాంశం. ముఖ్యమంత్రి అరుణాచలం అవినీతి ఆరోపణలతో 15 సంవత్సరాలుగా విచారణను ఎదుర్కొంటుంటారు. ముఖ్యమంత్రి కావాలని, ఆ పదవి కోసం వారిలో ఇది కోరికను మరింతగా పెంచుతుంది. ఇదిలా ఉండగా జార్ఖండ్‌లోని మారుమూల పల్లెటూరులో, రెండు దశాబ్దాల క్రితం జరిగిన పాత మర్డర్ కేసుని సీబీఐ ఆఫీసర్ వాన్ ఖాన్ పరిశోధిస్తుంటారు, అదే సమయంలో చెన్న నగనంలో తల, శరీరభాగాలు వేరు చేయబడిన ఓ శరీరం దొరుకుతుంది. ఈ భయంకర ఘటనకు కారకులైన వారిని కనిపెట్టటానికి చెన్నై డీజీపీ మణికందన్ పరిశోధన చేస్తుంటారు. క్రమక్రమంగా నగరంలో జరరగుతున్న ఈ దుర్ఘటనల వెనుకున్న నిజమేంటనేది బయటకు వస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సిరీస్ చూసేయండి.
తాజావార్తలు
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!