తమిళనాడులో టాప్ హీరోల లిస్ట్ తీస్తే రజినీకాంత్, కమల్ తర్వాత మూడో స్థానం కోసం పోటీలో ఉండే హీరోల్లో అజిత్ ఒకడు. ‘తల అజిత్’ అని ఫాన్స్ ప్రేమగా పిలుచుకునే అజిత్, దళపతి విజయ్ కి ఉన్న ఏకైక స్ట్రాంగ్ కాంపిటీషన్. పీక్ స్టేజ్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న అజిత్ ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. జనరల్ గా సోషల్ మీడియాలో ఏదైనా సినిమా గురించి ట్రెండ్ చెయ్యాలి అంటే ఒక అప్డేట్ ఉండాలి, లేదా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండాలి. ఈ రెండు లేకున్నా సోషల్ మీడియాలో ఒక పేరు ట్రెండ్ అవుతుంది అంటే అజిత్ కుమార్ కి మాత్రమే సాధ్యం. అజిత్ కుమార్ అకా AK అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వని రోజు ఉండదు, అంతలా ‘తల’ ఫాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. తాజాగా అజిత్ ఫాన్స్ చేస్తున్న ట్రెండ్ ‘AK 62’. ఇటివలే తునివు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అజిత్.
కోలీవుడ్ నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో తునివు సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ మూవీ అయిపోగానే అజిత్ తన నెక్స్ట్ సినిమాని ఎవరితో చెయ్యబోతున్నాడు అనే డిస్కషన్ స్టార్ట్ అయిపొయింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అజిత్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. మగిళ్ తిరుమేణి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణ్ ప్లేస్ లో అనిరుద్ ని ఫైనల్ చేశారని, దాదాపు AK 62 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ వీక్ లోనే బయటకి రానుందని సమాచారం. ఈ వార్త బయటకి రావడంతో ఫాన్స్ సోషల్ మీడియాలో AK 62 ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, వీడియోస్ తో ట్విట్టర్ లో హంగామా చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే అజిత్ ఫాన్స్ AK 62 అనౌన్స్మెంట్ వచ్చిన రోజు సోషల్ మీడియాలో ఇంకెంత హల్చల్ చేస్తారో ఊహించొచ్చు. నిజానికి AK 62 ఈపాటికే అనౌన్స్ అవ్వాల్సి ఉంది కానీ అజిత్ తండ్రి చనిపోవడంతో మేకర్స్ కాస్త బ్రేక్ ఇచ్చారు.