Site icon NTV Telugu

TG Viswaprasad: పవన్ రెమ్యూనిరేషన్.. ప్రపంచంలో ఎవడికి అడిగే హక్కు లేదు

Pawan Kalyan

Pawan Kalyan

TG Viswaprasad:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్. వివేక్ కూచిభోట్ల నిర్మించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించాడు. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ తో, వింటేజ్ పవన్ సినిమా పాటలతో అభిమానులకు ఫ్యాన్ ఫీస్ట్ గా నిలిచింది.పవన్ సినిమా హిట్, ప్లాప్ అని తేడా లేకుండా కలెక్షన్స్ రాబడుతాయి అన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా సక్సెస్ అవడంతో ఒకపక్క తేజ్ సక్సెస్ మీట్స్ లో, టెంపుల్స్ కు వెళ్లి మొక్కులు చెల్లించడం చేస్తుండగా.. మరోపక్క నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ ను పెంచుతున్నాడు.

Allu Arjun: ఇదేందయ్యా ఇది.. బన్నీకి జోడిగా AI హీరోయినా..?

తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్ పవన్ రెమ్యూనిరేషన్ గురించి బ్రో సినిమా బడ్జెట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రో సినిమా బడ్జెట్ వందకోట్లు అంట కదా అది ఇండియాలోదా..? అమెరికా నుంచి తీసుకొచ్చారా..? అని అడిగిన ప్రశ్నకు.. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ” అది ఒకరికి అవసరం లేదు.. ఒకరికి అవసరంలేని ఆన్సర్ నేను ఇవ్వదల్చుకోలేదు. ఈ సినిమాకి ఎంత అయింది అనేది మాకు జి టీవీ కి మాత్రమే తెలుసు. మాకు తప్ప ప్రపంచంలో ఎవరికి అది తెలియాల్సిన అవసరం లేదు.. అని చెప్పాడు. అయితే పవన్ రెమ్యూనరేషన్ గురించి చెప్పండి అన్న ప్రశ్నకు.. ” అది మా కంపెనీకి, కళ్యాణ్ గారికి ఉన్న అగ్రిమెంట్.. ప్రపంచంలో ఎవడికి అది అడిగే హక్కు లేదు. ఆయన ఇన్ కమ్ టాక్స్ రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఆయన చేసుకుంటారు.. మా ట్యాక్స్ ఫైలింగ్ చేసుకున్నప్పుడు మేము చేసుకుంటాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విడో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version