Site icon NTV Telugu

Charan : ఈసారి ఫారిన్‌లో ప్లాన్ చేసిన చరణ్..!

New Project (3)

New Project (3)

 

అప్పుడప్పుడూ సినిమా షూటింగుల నుంచి రిలీఫ్ కోసం.. ఫారిన్ వెళ్తుంటారు రామ్ చరణ్. ఇక ఇప్పుడు కూడా ఓ ఫారిన్ ట్రిప్ వేయబోతున్నారు. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. సడెన్‌గా వెకేషన్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణమే ఉంది. తన వైవాహిక జీవితంలో.. చరణ్‌కు ఈ ఏడాది ఎంతో స్పెషల్‌గా నిలవనుంది. అందుకే విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ఇంతకీ చరణ్‌ ఎక్కడికి వెళ్తున్నాడు.. ఎందుకోసం వెళ్తున్నాడు..!

ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా.. కెరీర్‌లోనే బెస్ట్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు చరణ్. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఆచార్య ఫ్లాప్ అవడంతో.. కాస్త డీలా పడిపోయారు. అందుకే అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు.. ఆ సినిమాను శంక‌ర్‌ తెరకెక్కిస్తుండడంతో.. అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. చరణ్ ఇప్పుడు ఓ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈ నెల 14న రామ్‌చ‌ర‌ణ్ పెళ్లి రోజు కావడంతో.. విదేశాలకు పయనమయ్యారు చరణ్, ఉపాసన జోడి. 2012 జూన్ 14న వీరి పెళ్లి అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఏడాదితో వీరి పెళ్లి జరిగి పదేళ్లు కానున్నాయి. దాంతో తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉండే ఈ సెలెబ్రిటీ కపుల్.. టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీని.. ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా.. ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని భావిస్తున్నారట. అందుకే ఈ సారి మ్యారేజ్ డే సెల‌బ్రేష‌న్స్ ను ఇట‌లీలోని మిలాన్‌లో జ‌రుపుకోబోతున్న‌ట్లు స‌మాచారం. అక్కడ నాలుగైదు రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. ఇకపోతే..పెళ్ళైన తర్వాత నటుడుగా రామ్ చరణ్.. బిజినెస్ ఉమన్‌గా ఉపాసన ఫుల్ బిజీగా ఉన్నారు.

Exit mobile version