Site icon NTV Telugu

Telugu Indain Idol: గాన గాంధర్వుడిని స్మరించుకుంటూ…

Telugu Indian Idol

Telugu Indian Idol

తెలుగు ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్ రౌండ్ ఇప్పుడు జరుగుతోంది. 12 మంది కంటెస్టెంట్స్ కు ఛాన్స్ ఇచ్చిన న్యాయనిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తిక్… ఈ షో నుండి మొదటగా పంజాబ్ కు చెందిన సింగర్ జస్కరన్ ను ఎలిమినేట్ చేశారు. అయితే ఆ తర్వాత వీకెండ్ మాత్రం ఎలాంటి ఎలిమినేషన్స్ లేకుండా ఎపిసోడ్ సాగింది. నిత్యామీనన్, కార్తిక్, తమన్ కు సంబంధించిన సాంగ్స్ శుక్రవారం పాడగా, శనివారం ఈ షోకు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ మూవీస్ లోని సాంగ్స్ ను కంటెస్టెంట్స్ పాడారు. ఇదిలా ఉంటే… రాబోయే శుక్ర, శనివారాల్లో గాన గాంధర్వుడు, స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివాళిగా కార్యక్రమం జరుగబోతోంది. ఈ ఎపిసోడ్స్ కు పాపులర్ సింగర్ కల్పన స్పెషల్ గెస్ట్ గా హాజరు కావడం విశేషం. మరి బాలు పాడిన వేలాది పాటల్లో వేటిని ఈ సింగర్స్ పిక్ చేసుకుని పాడతారో చూడాలి. మొత్తం మీద తెలుగు ఇండియన్ ఐడిల్ షో లో ఇది సూపర్ స్పెషల్ ఎపిసోడ్ గా నిలువబోతోందన్నది వాస్తవం.

Exit mobile version