RRR దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మ్యాగ్నమ్ ఓపస్ విడుదలకు సిద్ధంగా ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “ఆర్ఆర్ఆర్” విడుదలైన మొదటి 10 రోజుల పాటు ప్రత్యేక టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి అంగీకరించింది. అంతేకాదు తొలి పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలను ప్రదర్శించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also : Sitara : మిమ్మల్ని గర్వపడేలా చేస్తా నాన్నా…
మల్టీప్లెక్స్‌లలో మార్చి 25 నుండి 3 రోజుల పాటు రూ. 70, రూ. 100 (సాధారణ & రిక్లైనర్), తదుపరి 7 రోజులకు రూ. 50 అదనంగా టికెట్ ధర ఉంటుంది. AC సింగిల్ స్క్రీన్‌ల కేటగిరీలో మూడు రోజులకు రూ. 50, 7 రోజులకు రూ.30 అదనంగా టికెట్ ధరలకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త GO జారీ చేసిన రెండు రోజుల తర్వాత తెలంగాణలో RRRకి అనుమతించిన అదనపు రేట్లు వర్తిస్తాయి. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని థియేటర్లకు అడ్మిషన్ రేట్లకు మించి టిక్కెట్టుకు రూ. 75 పెంచడానికి అనుమతించింది. కొత్త జీవోతో థియేటర్ యజమానులు ప్రస్తుత టిక్కెట్ ధరలకు అదనంగా టిక్కెట్లను విక్రయించవచ్చు. అలాగే నగరాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మూవీ విడుదలైన తేదీ నుండి 10 రోజుల పాటు టిక్కెట్లను రూ. 236, మల్టీప్లెక్స్‌లలో రూ. 265కి విక్రయించవచ్చు.
వీకెండ్ లో అంటే మూడు రోజుల నుంచి సింగిల్ స్క్రీన్స్ లో రూ.236, మల్టిప్లెక్స్ లలో రూ.413, ఆ తరువాత నుంచి సింగిల్ స్క్రీన్స్ లో రూ.212.4, మల్టిప్లెక్స్ లలో రూ.354 కు టికెట్ రేట్లను విక్రయించనున్నారు.రెండు రాష్ట్రాల టిక్కెట్ల పెంపుపై సోషల్ మీడియాలో మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఈ టికెట్ రేట్ల పెంపుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ టీంకు సపోర్ట్ చేస్తున్నారు.