Site icon NTV Telugu

Teja Sajja : పెద్దవాళ్లే మోసం చేశారు.. తేజసజ్జా షాకింగ్ కామెంట్స్

Teja Sajja

Teja Sajja

Teja Sajja : తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తున్నాడు. వరుస ప్రమోషన్లలో తేజ చేస్తున్న కామెంట్లు అందరినీ షాక కు గురి చేస్తున్నాయి. ఓ వైపు సినిమాల గురించి చెబుతూనే.. తన కెరీర్ లో జరిగిన ఎన్నో షాకింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజసజ్జా తన జీవితంలో ఎదురైన అవమానాల గురించి ఓపెన్ అయ్యాడు. అతను మాట్లాడుతూ.. నేను చైల్డ్ ఆర్టిస్టుగా చేసినా సరే నా లైఫ్‌ లో ఎన్నో అవమానాలు భరించాను. అవన్నీ నా వ్యక్తిగతమే అయినా.. ఎప్పుడూ బయట పెట్టలేదు.

Read Also : Nidhi Agarwal : నిధి అగర్వాల్ అందాల నిధులు చూడతరమా..

కొన్ని సార్లు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అవతల చేస్తుంది పెద్దవాళ్లు. వాళ్ల గురించి మనం బయట చెప్పలేం. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. కొన్ని సార్లు అవకాశాల పేరుతో పిలిచి కావాలని మధ్యలో వద్దని చెప్పేసేవారు. ఇంకొన్ని సార్లు పెద్ద హీరోలు చేయలేదనే కోపంతో.. వాళ్లకు చూపించడానికి నాతో సినిమా తీసేవాళ్లు. అది తర్వాత తెలిసి నాపై నాకే జాలి వేసేది. ఇలా ఎన్నో జరిగాయి. కేవలం నన్ను వాడుకుంటున్నారనే విషయం నాకు అప్పట్లో అర్థం కాకపోయేది. తర్వాత తెలిసినా నేను బయటకు చెప్పడానికి వీలుకాదు అంటూ ఎమోషనల్ అయ్యాడు తేజసజ్జా.

Karuna Kumar : ‘ప్రొద్దుటూరు దసరా’ ఆలోచింపజేస్తుంది.. డైరెక్టర్ కరుణ కుమార్ కామెంట్స్

Exit mobile version