Teja Sajja: హీరో తేజ సజ్జా తదుపరి సినిమాలకు సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రూమర్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జై హనుమాన్’ గురించి వస్తున్న వార్తలు అయితే ఆయన అభిమానులను అయోమయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో తేజ టీం స్పందిస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది. తేజ సజ్జా చేస్తున్న సినిమాల విషయంలో కానీ, వాటి మార్పుల గురించి కానీ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేజ పిఆర్ టీం స్పష్టం చేసింది. ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్ నుంచి తేజ తప్పుకున్నారని లేదా స్క్రిప్ట్ మారిందని వస్తున్నవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. గతంలో నిర్ణయించిన విధంగానే ప్లానింగ్ జరుగుతోందని, ఎటువంటి మార్పులు జరగలేదని అధికారికంగా వెల్లడించారు.
Also Read:Syria: కొత్త కరెన్సీని రిలీజ్ చేసిన ముస్లిం దేశం.. ఎందుకో తెలుసా!
సినిమా రంగంలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల ప్రాజెక్ట్‌లపై ప్రభావం పడుతుందని, కాబట్టి ఎలాంటి ఆధారాలు లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని టీమ్ విజ్ఞప్తి చేసింది. అన్ని మునుపటి ప్లాన్ ప్రకారమే సాగుతోందని, సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ ఉంటే నేరుగా తామే తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రావడంతో తేజ సజ్జా అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సినిమా ప్రధానంగా రిషబ్ శెట్టి పోయించే హనుమంతుడి పాత్ర చుట్టూ తిరుగుతుందని గతంలో తేజ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read:Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..రూ.50 నుంచే ‘అఖండ 2’ టికెట్లు..
