Site icon NTV Telugu

Teja Sajja : తేజసజ్జా.. ఆ హీరోల లిస్టులో చేరిపోయినట్టే

Mirai Teja

Mirai Teja

Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. మనోడికి మైథలాజీ ప్రాజెక్టులు బాగా సూట్ అవుతున్నాయి. అప్పుడు హనుమాన్ తో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ సినిమా అతని కెరీర్ కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు అలాంటి మైథలాజికల్ స్టోరీతోనే వచ్చిన మిరాయ్ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటోంది. చూస్తుంటే పాన్ ఇండియాను మరోసారి ఊపేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ మధ్య మైథలాజికల్ కథలకు నార్త్ లో భారీ డిమాండ్ ఉంటోంది. కార్తికేయ-2, హనుమాన్ సినిమాలు నార్త్ లో దుమ్ము లేపాయి. ఇప్పుడు మిరాయ్ కూడా అదే బాటలో వెళ్తే మాత్రం.. తేజ సజ్జాకు రూ.200 కోట్ల క్లబ్ మరోసారి ఖాయం అంటున్నారు.

Read Also : Mirai : మనోజ్ కు కలిసొచ్చిన మోహన్ బాబు ఫార్ములా

అదే గనక జరిగితే తేజ సజ్జా టైర్-2 హీరోల లిస్టులో చేరిపోవడం గ్యారెంటీ. ఇప్పటికే యూత్ లో భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఆయన సినిమా బడ్జెట్ కూడా రూ.50 కోట్లను దాటిపోతున్నాయి. మిరాయ్ బడ్జెట్ రూ.60 కోట్లకు పైమాటే. ఈ సినిమాతో తేజ మార్కెట్ పాన్ ఇండియాలో పాతుకుపోతే ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ రూ.100 కోట్ల బడ్జెట్ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. పైగా తేజ సినిమాలు అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టే చూస్తున్నారు ఆడియెన్స్. ఈ లెక్కన టైర్-2 హీరోలకు ఏ మాత్రం తీసిపోని మార్కెట్, ఫేమ్, బడ్జెట్ అన్నీ తేజకు ఈ సినిమాతోనే రాబోతున్నాయి. కాబట్టి టైర్-2 హీరోల లిస్టులో తేజ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఇక మిగిలింది స్టార్ హీరోల లిస్టులో చేరడమే. పెద్ద హీరోల లిస్టులోకి వెళ్లాలంటే ఇంకొంచెం టైమ్ పడుతుందేమో. తేజ ఇలాగే ఇంకో రెండు భారీ హిట్లు కొడితే అది కూడా ఈజీనే.

Read Also : Tamannah : అతన్నే పెళ్లి చేసుకుంటా.. తమన్నా షాకింగ్ ఆన్సర్

Exit mobile version