Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా వైజాగ్ బీచ్ రోడ్డులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో నటించగా.. రితిక నాయక్ హీరోయిన్ గా చేసింది. ఈవెంట్ లో తేజ మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి తీశాం. ఈ సినిమాను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాం. దాన్ని ఈ ఈవెంట్ నుంచే నేను చెబుతున్నాను.
Read Also : Mirai : ఓజీ థియేటర్లలో రక్తపాతమే : తేజసజ్జా
మా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచట్లేదు. నార్మల్ ధరలకే టికెట్లను అందిస్తున్నాం. అందరూ సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాం. ఇది చాలా రిస్క్ తో కూడింది అని తెలుసు. కానీ మీ కోసం, మా సినిమా కోసం ఇలా చేస్తున్నాం అని తెలిపాడు తేజసజ్జా. దీంతో ఈ మూవీకి టికెట్ రేట్ల పెంపులేదని తేలిపోయింది. అలాగే మూవీ యూఎస్ టికెట్ ఓపెనింగ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని తెలిపాడు తేజ.
Read Also : Manchu Manoj : మీరు నా వెనకాల ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు
