”మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం” లాంటి విభిన్నమైన, వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు ప్రస్తుతం ‘దోచేవారెవరురా’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఐ.క్యూ. క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు ఈ సరికొత్త కామెడీ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవచంద్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు.


ఈ సినిమాలో బాలెన్స్ ఉన్న చివరి పాటను ఇటీవల రామోజీ ఫిలిమ్ సిటీలో ఓ సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు. మూవీలో ఓ కీలక సందర్భంలో ఈ పాట రానుంది. హీరోయిన్ మాళవికపై చిత్రీకరించిన ఈ పాటకు శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. విశేషం ఏమంటే… శివ నాగేశ్వరరావుతో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ తో దర్శకుడు తేజ ఈ పాటకు కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ లో జనం ముందుకు రానుంది.