RRR గ్రాండ్ రిలీజ్‌కు ముందు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రయం దేశవ్యాప్తంగా దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ రోజు బృందం ‘ఆర్ఆర్ఆర్’ని ప్రచారం చేయడానికి ఇప్పటికే బరోడాలో అడుగు పెట్టింది. అక్కడి ప్రత్యేకమైన ‘స్టాచ్యూ అఫ్ యూనిటీ’ దగ్గర చిత్ర బృందం జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవుతుంది.
Read Also : Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు
ఇక అక్కడి రోడ్లపై ‘ఆర్ఆర్ఆర్’ స్టిక్కర్స్ అంటించిన కార్లు కన్పించడం, బరోడాలో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ల్యాండ్ అయిన ఫోటోలు, ‘స్టాచ్యూ అఫ్ యూనిటీ’ దగ్గర రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ చిత్రంలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ తదితరులు కూడా భాగమయ్యారు. డివివి దానయ్య భారీ ఎత్తున నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’కి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.