Site icon NTV Telugu

Major: హాలీవుడ్ మాదిరి.. అడివి శేష్ కొత్త ప్రయోగం

Major Special Previews

Major Special Previews

హాలీవుడ్ సినిమాల్ని రిలీజ్ చేయడానికి ముందు, కొన్ని ప్రధాన నగరాల్లో ప్రివ్యూస్ వేస్తారు. పది లేదా నెల రోజుల వ్యవధిలో ప్రివ్యూ షోస్ వేయడం జరుగుతుంది. తమ సినిమాలకు మరింత బజ్ తెచ్చుకునేందుకే ఈ స్ట్రాటజీ. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తన ‘మేజర్’ సినిమాకి అడివి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉండే జనాల్లోకి తీసుకువెళ్ళడం కోసం.. ప్రీవ్యూస్ వేసేందుకు రెడీ అయ్యాడు. 9 ప్రధాన నగరాల్లో వేయనున్న ఈ ప్రివ్యూ స్క్రీనింగ్.. మే 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విడుదలకి పది రోజుల ముందు ఇలా ప్రివ్యూస్ వేయడం, భారత్‌లో ఇదే మొదటిసారి.

ఈ స్క్రీనింగ్ కోసం మేకర్స్ బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రివ్యూస్ చూడాలనుకున్న వారు.. బుక్ మై షో లో టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్, కొచ్చి మొదలైన నగరాల్లో ప్రివ్యూస్ ప్రదర్శిస్తారు. ఈ ప్రయోగం ‘మేజర్’ చిత్రానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి. కాగా.. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూలిపాళ ఓ కీలక పాత్ర పోషించింది.

సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాలా సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో జూన్ 3వ తేదీన భారీఎత్తున విడుదలకు ముస్తాబవుతోంది.

Exit mobile version