యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ షూటింగ్ చివరి దశలో ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ మూవీలో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల నుండి స్ఫూర్తితో రూపొందిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ, లవ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.
Also Read : Mohan Lal : ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న మోహన్ లాల్ బిగ్గెస్ట్ డిజాస్టర్
కాగా ఈ సినిమాతో అక్కినేని నాగ చైతన్య తొలిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. తండేల్ ను తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబందించిన ప్రమోషన్స్ ను కూడా మొదలెట్టారు మేకర్స్. తమిళ్ లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిచర్స్ రిలీజ్ చేస్తుండగా బాలీవుడ్ లో ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు మేకర్స్. కానీ తమిళ్ రిలీజ్ పట్ల అక్కినేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుక్కారణం తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. అయితే దానికి ఒక రోజు ముందు అనగ ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ గా విదాముయార్చి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అజిత్ సినిమా అంటే తమిళనాడులో జరిగే హంగామా అంత ఇంత కాదు. ఇదే చై ఫ్యాన్స్ ను కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. అయిన సరే అక్కడ కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.