Tamil TV Actress Shruti Shanmugapriya’s Husband Died: తమిళ టీవీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీరియల్ నటి శృతి షణ్ముగప్రియ భర్త గుండెపోటుతో మృతి చెందారు. ఈ సమాచారం కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వెల్లడి కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నటి శ్రుతి షణ్ముగప్రియ అభిమానులు అయితే షాక్ అయ్యారు. ఎందుకంటే షణ్ముగప్రియకి పెళ్లయి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. ఆమె గత ఏడాది మే నెలలోనే ఏడడుగులు వేసింది. నటి శృతి షణ్ముగప్రియ గత ఏడాది మే నెలలో అరవింద్ శేఖర్‌ను వివాహం చేసుకుంది. తరచూ తన భర్తతో కలిసి రొమాంటిక్ రిలీజ్ వీడియోలను పోస్ట్ చేసే ఆమె గత వారం రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. ఇలాంటి తరుణంలో షణ్ముగప్రియ భర్త అరవింద్ శేఖర్ చనిపోయాడని వార్తలు వచ్చాయి.
SIIMA 2022: బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో జక్కన్నతో పోటీలో ఆ నలుగురు కుర్ర దర్శకులు
స్వతహాగా బాడీ బిల్డర్ అయిన అరవింద్ శేఖర్ గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. కఠోరమైన వ్యాయామం చేయడంలో దిట్ట అయిన ఈ షణ్ముగప్రియ భర్తకి గుండె పోటు ఎలా వచ్చిందనే విషయంపై నెటిజన్లు అయోమయంలో పడ్డారు. షణ్ముగప్రియ భర్త బాడీ బిల్డింగ్ కోసం ఏమైనా స్టెరాయిడ్ తీసుకున్నారా..? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అరవింద్ శేఖర్ మరణ వార్త విని స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు అందరూ షాక్ అవుతున్నారు. పెళ్లయిన ఏడాదికే భర్తను కోల్పోయిన శృతి షణ్ముకప్రియకు పలువురు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక వీరిద్దరి రొమాంటిక్ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. శ్రుతి సన్ముగప్రియ కల్యాణ పరిషత్ భారతికన్నమ్మతో సహా పలు సీరియల్స్‌లో నటించి ఫేమ్ సంపాదించింది. రియాల్టీ షోలలో కంటెస్టెంట్‌గా, ప్రత్యేక అతిథిగా కూడా ఆమె పాల్గొనేది.