NTV Telugu Site icon

Kollywood: తమిళ సినిమా నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం

Untitled Design (6)

Untitled Design (6)

తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇలా విడుదలవగానే వారం, రెండువారాలు మరి అయితే నాలుగువారాలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా (టీఎఫ్‌పీసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సినీనిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో కలిసి కట్టుగా ఒక తీర్మానం చేసారు.

తమిళంలో నిర్మించే ఏ సినిమానైనా ఇకపై 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. స్టార్‌ హీరోలు నటించిన చిత్రాలైన సరే థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు ఇవ్వాలని రైట్స్ సేల్ చేసేటప్పుడు ఆ నిబంధనమీద డీల్ చేసుకోవాలనిం తెలిపింది. అదే విధంగా రానున్న ఆగస్టు 16వ తేదీ తర్వాత మారే ఇతర కొత్త సినిమాలు షూటింగ్‌ స్టార్ట్ చేయకూడదని వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న సినిమాలను అక్టోబర్‌ 31 లోగా షూటింగ్ కంప్లైట్ చేయాలని, నవంబర్‌ 1వ తేదీ నుంచి ఏ విధమైన షూటింగ్స్‌ చేపట్టకూడదని తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది.

అదే కోవలో తమిళ అగ్రహీరో ధనుష్‌పై నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) అగ్రహం వ్యక్తంచేసింది. ధనుష్ ఫై కొన్ని నిబంధనలు పెట్టింది. ధనుష్ ఇప్పటికే చాలా మంది తమిళ నిర్మాతల దగ్గర భారీ మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకొని డేట్స్ ఇవ్వకుండా ఇతర భాషల నిర్మాతలకు డేట్స్ ఇస్తుండడంపై టీఎఫ్‌పీసీ తీవ్ర అభ్యంతరంతెలిపింది. ధనుష్ తో సినిమా చేయాలంటే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని టీఎఫ్‌పీసీ తెలిపింది. త్వరలో శింబు, విశాల్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయంపై నడిఘర్ సంఘం తీవ్ర అభ్యంతరం తెలిపింది. నడిఘర్ ను సంప్రదించకుండా ఆలా ఎలా నిర్ణయం తీసుకుంటారని టీఎఫ్‌పీసీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు నడిఘర్ అధ్యక్షులు నాజర్.

Also Read: Maharaja: మహారాజ హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?

Show comments