చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్లు ఒకరి తరువాత ఒకరు విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ లను ఇస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత.. ఇటీవల ధనుష్ విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ బాలా తన భార్యతో లీగల్ గా విడిపోయారు. ఇటీవలే ఆయనకు ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 17 ఏళ్ల క్రితం ముత్తు మలర్ తో బాలా వివాహం జరిగింది. వీరికి ఒక పాప. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో నాలుగేళ్ళ నుంచి వీరు విడిగానే ఉంటున్నారు. మ్యూచువల్ విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చచేసింది. డైరెక్టర్ బాలా అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితుడే.. బాలా తెరకెక్కించిన శివపుత్రుడు, శేషు, వాడు- వీడు చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.
Director Bala: అభిమానులకు షాక్.. మరో స్టార్ డైరెక్టర్ విడాకులు

director bala