Tamil actor Vishal alleges corruption in CBFC Centre initiates inquiry: తమిళ స్టార్ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం అడిగారని ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “వెండితెరపై అవినీతి చూపించడం కామన్ కానీ నిజ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. అలాంటి నేను తొలిసారి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సి వచ్చింది, ముంబైలోని CBFC(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఆఫీస్ లో ఇంకా దారుణం అవినీతి జరుగుతోంది, నా సినిమా ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం రూ.6.5 లక్షలు లంచం చెల్లించాల్సి వచ్చిందని చెబుతూ తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని ఆయన అన్నాడు.
Gundeninda Gudi Gantalu: ‘స్టార్ మా’లో సరికొత్తగా “గుండె నిండా గుడిగంటలు” సీరియల్
ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొస్తున్నానాని అన్నారు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడంతో విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. CBFCలో సినిమా సర్టిఫికేషన్ కోసం లంచం అడగడం అత్యంత దారుణం అని, విశాల్ కు ఎదురైన ఘటన నిజంగా అత్యంత దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవినీతి ఏమాత్రం సహించదని, ఈ లంచం వ్యవహారం వెనుక ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ అధికారి ఈరోజే విచారణ కోసం ముంబైకి పంపించామని, త్వరలోనే బాధ్యులపై చర్యలుంటాయని అన్నారు. CBFC ద్వారా వేధింపులు ఎదరైతే jsfilms.inb@nic.in ద్వారా సమాచారం ఇవ్వండని, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించిందని అన్నారు.