Site icon NTV Telugu

Thaman : నటుడిగా వెండితెరపై తమన్ రీ ఎంట్రీ

Atharv

Atharv

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్  (నందమూరి) తమన్ అగ్ర స్తానంలో ఉంటాడు. స్టార్ హీరోల సినిమాలన్నిటికి ఇతగాడే సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ తో తన సత్తా ఏంటో చూపించాడు తమన్. సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఇప్పుడు వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్టు తెలుస్తోంది.

Also Read : Megastar : గ్రాండ్ గా చిరు మాతృమూర్తి పుట్టిన రోజు వేడుక

తమిళ యంగ్ హీరోలలో అథర్వ మురళి మంచి గుర్తింపు ఉంది, ఇప్పుడు తమిళంలో అథర్వ హీరోగా ఆకాష్ భాస్కరన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చక చక జరుగుతోంది. అయితే ఈ సినిమాలో అథర్వ మురళితో పాటు మరో లీడ్ రోల్ కూడా ఉందట. ఆ రోల్ కోసం టాలీవుడ్ సెన్సేషన్ తమన్ ను సంప్రదించారట. దర్శకుడు చెప్పన కథ కూడా నచ్చడంతో తమన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమాలో మలయాళ భామ మమిత బైజు హీరోయిన్ గా చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరికొన్ని కీలక వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్. కెరిర్ తొలినాళ్లలో శంకర్ డైరేక్షన్ లో వచ్చిన బాయ్స్ సినిమాలో తమన్ నటించాడు. మళ్ళి ఇన్నాళ్లకు అథర్వ్ సినిమాలో నటించబోతున్నాడు యువ సంచలం తమన్. ఇక సంగీత దర్శకుడిగా నందమూరి బాలయ్య నటిస్తున్నఅఖండ 2 ,పవన్ కళ్యాణ్ OG కి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version