“సైరా” తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ థియేటర్లు, సినిమా షూటింగ్‌లపై పడకుండా ఉంటే ఇప్పటి వరకు కనీసం రెండు మెగాస్టార్ చిత్రాలు విడుదల అయ్యేవి. చిరు ప్రస్తుతం కొరటాల శివతో “ఆచార్య”, మోహన్ రాజాతో “గాడ్ ఫాదర్”, మెహర్ రమేష్ “భోళా శంకర్”, ఇంకా బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో సహా దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు.
Read Also : నెక్స్ట్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్
అయితే ఇక్కడ మెగాస్టార్ వరుస సినిమాలు చేయడం విషయం కాదు. ఆ సినిమాల్లో హీరోయిన్స్‌ని ఎంపిక చేయడం అసలైన పని. పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి వారు ఫుల్ బిజీ. కాబట్టి వాళ్ళు డేట్స్ ఇవ్వలేరు. సీనియర్ స్టార్ హీరోయిన్లు తమన్నా, కాజల్, త్రిష వంటి హీరోయిన్ల చేతిలో పెద్దగా సినిమాలు లేవు. కాబట్టి వాళ్ళు చిరు సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. “వేదాళం” రీమేక్ “భోళా శంకర్”లో చిరంజీవి సరసన శృతి హాసన్‌లో నటిస్తోందని అన్నారు. ఒరిజినల్‌లో శృతి అజిత్‌తో రొమాన్స్ చేసింది. చిరుతో కూడా ఆమెనే అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల మెగాస్టార్ ఇప్పుడు శృతి ప్లేస్ లో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నారు. గతంలో ఆమె “సైరా”లో చిరంజీవితో జతకట్టింది. కానీ అందులో చిరుతో తమన్నా చిందేయలేదు. అయితే ఇప్పుడు “భోళా శంకర్” మాస్ మూవీ కాబట్టి బెస్ట్ డ్యాన్స్ ట్రీట్‌లను చూడవచ్చని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తమన్నా హీరోయిన్‌గా నటిస్తుందనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. వచ్చే నెలలో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు మహతి సాగర్ సంగీత దర్శకుడు. మరోవైపు చిరంజీవి ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఊటీలో “గాడ్ ఫాదర్” షూటింగ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది చిరంజీవికి మూడు సినిమాల రిలీజ్‌లు ఉంటాయి.