Site icon NTV Telugu

Tamannah : అతన్నే పెళ్లి చేసుకుంటా.. తమన్నా షాకింగ్ ఆన్సర్

Tamannah 1

Tamannah 1

Tamannah : స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఎంత వయసొచ్చినా సరే తన అందం మాత్రం ఇంచు కూడా తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉంది. ఆ మధ్య విజయ్ వర్మతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే బ్రేకప్ చెప్పేయడంతో సినిమాలపై ఫోకస్ పెడుతోంది. చూస్తుంటే ఈ బ్యూటీ మళ్లీ లవ్ లో పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ అమ్మడు ఈ నడుమ ఎక్కువగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతోంది. తాజాగా మరోసారి తాను ఎలా ఉండాలి అనుకుంటున్నానో తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కాకపోతే ఎవరిని చేసుకుంటాను అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Read Also : Krithi Shetty : బాబోయ్.. కృతిశెట్టి పరువాల మంటలు

నేను పెళ్లి చేసుకుంటే తమన్నా లాంటి భార్య దొరికినందుకు గత జన్మలో ఏదో పుణ్యం చేసి ఉండాలి అని అతను అనుకోవాలి. ఆ విధంగానే నేను అతన్ని చూసుకుంటాను. నన్ను కూడా అంత ప్రేమగా, కేరింగ్ గా చూసుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను. అలాంటి వ్యక్తి దొరికితే ఏ మాత్రం లేట్ చేయకుండా పెళ్లి చేసేసుకుంటా. ఇప్పటికీ అదే ఆలోచనతో ఉన్నాను. నా ఏజ్ తో సంబంధం లేకుండా నేను పెళ్లి గురించి కొన్ని అంచనాలు పెట్టుకున్నాను అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఈమె ఇలాంటి మాటలు చెబుతుండటంతో.. కచ్చితంగా ఎవరితోనో లవ్ లో ఉందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Read Also : Teja Sajja : ఆ హీరోనే నన్ను ఆదుకుంటాడు.. తేజసజ్జా కామెంట్స్

Exit mobile version