సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ చూసి మనం కూడా వాళ్ళ లాగా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నంత ఈజీ గా వారీ జీవితాలు ఉండవు. వారు ఎంత ఫేమస్ అయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితం మాత్రం చాలా చిన్నది. దీంతో వారు ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా ఇట్టే వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా వార్తల్లో నిలిచింది. తాను చేసిన ఓ చిన్న పోస్ట్ తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే పుకార్లకు ఆజ్యం పోసింది.. ఇంతకి ఆ పోస్ట్ లో ఏముంది అంటే.
Also Read:Samantha: మొదటి సారిగా నాగచైతన్య రెండో పెళ్లి గురించి స్పందించిన సమంత ..!
కెరీర్ పరంగా దూసుకుపోతున్న తమన్నా గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ చాలా సందర్భాల్లో పలు ఈవెంట్స్ , పార్టీలలో జంటగా కనిపించారు. అలాగే.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేశారు. అలా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనీ, తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని భావిస్తున్నారని పలు వార్తలు వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా తమన్న పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది.
‘ప్రేమించబడడానికి రహస్యం ప్రేమించడమే అని నేను అనుకుంటున్నాను. సరదాగా ఉండడానికి రహస్యం.. ఆసక్తికరంగా ఉండటమే. వేరే వాళ్ళు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వేరే వాళ్లను అలా ఉండాలి. ఒకరి స్నేహం కావాలంటే ముందు మనం వారితో ఫ్రెండ్‌గా ఉండాలి’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ కొటేషన్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది తమన్నా. ప్రజంట్ స్టోరీ వైరల్ అవుతుండటంతో.. ఇప్పటికిప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది.. కొంప తీసి వర్మతో తమన్నా విడిపోయిందా? అంటూ రూమర్స్ వైరలవుతున్నాయి. మరి దీని గురించి తమన్న స్పందిస్తుందో చూడాలి.