సినిమా అనేది కలల ప్రపంచం. ఇక్కడ గ్లామర్‌తో పాటు ప్రతిభ, అదృష్టం కూడా కలిస్తేనే స్టార్‌డమ్ వస్తుంది. ఈ అన్నింటినీ సొంతం చేసుకున్న బ్యూటీ తమన్నా. ఉత్తరాది భామ అయిన ఆమె, దక్షిణాదిలో హీరోయిన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు, ఐటమ్ సాంగ్స్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా రాణించిన తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. వ్యక్తిగత కారణాల వల్లనో ఆమె కెరీర్‌లో కొంత బ్రేక్ పడింది. స్పెషల్ సాంగ్స్ తప్పించి చెప్పుకోతగ్గ పాత్రలు రావడం లేదు. అయితే కెరీర్ బిగినింగ్ లో ఈ ముద్దుగుమ్మ చాలా పద్దతిగా నడుచుకున్నప్కటికి , ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చింది.. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోతుంది.. దీని కారణం తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తమన్నా..
Also Read : Mass Jathara : ‘మాస్ జాతర’ రిలీజ్ గందరగోళం.. టెన్షన్‌లో అభిమానులు!
ఒక తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. “నేను ఎప్పటినుంచో కసరత్తులు చేస్తూ ఉన్నా. కానీ నాకు శరీరం ఏం చెబుతుందో అదే చేస్తాను. బలవంతంగా ఏదీ చేయను. అలసటగా ఉన్నా, నిద్ర సరిగా లేకపోయినా, వర్కౌట్ మానేసి విశ్రాంతిని ప్రాధాన్యం ఇస్తాను” అని చెప్పారు. అలాగే, తనకు ప్రశాంతమైన ప్రదేశాలు, ధ్యానం చేయడం, దేవాలయాలకు వెళ్లడం చాలా ఇష్టమని తెలిపారు. ఇటీవల కాశీ యాత్ర తన జీవితంలో మర్చిపోలేని అనుభవమని, ఆ నగరంలోని ఆధ్యాత్మిక వాతావరణం తన మనసును ఎంతగానో ఆకట్టుకుందన్నారు. అలాగే తన కెరీర్ పై ఓపెన్‌గా మాట్లాడుతూ.. “నాకు గ్లామరస్ నటిగా ముద్ర వేసేశారు. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని నిబంధనలు పెట్టుకోవడంతో శక్తివంతమైన పాత్రలను కోల్పోయాను. నో-కిస్ పాలసీని కఠినంగా పాటించాను. కానీ ఆ ఆంక్షలు వదిలేసిన తర్వాత బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్స్ చేయడం మొదలెట్టాను. అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది” అని స్పష్టం చేశారు.