Tamannaah Bhatia Shocking Comments about Marriage: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ అనే సినిమాలో మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా పరిచయమైన తమన్నా తర్వాత తెలుగులో కొంతకాలం టాప్ హీరోయిన్స్ లీగ్ లో కూడా కొనసాగింది. ఈ మధ్యలో కొత్త భామల ఎంట్రీతో కాస్త వెనకబడిన ఆమె విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి మునిగి తేలుతోంది. అయితే తమన్న ప్రేమ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఆమె పెళ్లి ఎప్పుడు? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. తాజాగా హైదరాబాదులో ఒక షాప్ ఓపెనింగ్ నిమిత్తం వచ్చిన తమన్నాని ఎన్టీవీ ప్రత్యేకంగా పలకరించింది.
Ram Charan: వరద బాధితులకు రామ్ చరణ్ భూరి విరాళం
మీ పెళ్లి కబుర్లు ఏమైనా చెప్పమని అడిగితే దానికి ఆమె ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోవడం లేదు కంగారు పడవద్దు అంటూ కామెంట్ చేసింది. అయితే విజయ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకోవడంలేదని తాజా కామెంట్స్ తో క్లారిటీ వచ్చినట్లు అయింది. ఇక తమన్నాకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె ఎక్కువగా హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా అతిథి పాత్రలు కూడా ఏమాత్రం కాదనకుండా చేస్తూ పోతోంది. చివరి డెస్టినేషన్ ఎలాగో హీరోయిన్లకు బాలీవుడ్డే కాబట్టి ఇకపై బాలీవుడ్ లోనే ప్రాజెక్టులు చేసేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో అవకాశాలు వస్తే కూడా వెనక్కి తగ్గకుండా అవి కూడా ఒప్పుకునేందుకు ఆమె సిద్ధంగా ఉంది.
పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా..#Tamannaah #tamannaahspeaks #Hyderabad #rains #NTVTelugu #NTVENT pic.twitter.com/WCK6cpKNJl
— NTV Telugu (@NtvTeluguLive) September 4, 2024