Site icon NTV Telugu

Tamannah : అలాంటి ఇంజెక్షన్లు వాడుతున్న తమన్నా..? అసలు నిజం ఇదే..!

Tamanna

Tamanna

Tamannah : సినీ సెలబ్రిటీల మీద ఎప్పుడూ ఏదో ఒక రకమైన రూమర్ అనేది వస్తూనే ఉంటుంది. వాటిపై కొందరు రియాక్ట్ అవుతారు. ఇంకొందరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోతారు. ఇప్పుడు తాజాగా తమన్నా మీద కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆమె ఈ మధ్య కొంచెం బరువు పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువ అయిపోయాయి. కానీ ఆమె వాటిని లైట్ తీసుకుంది. వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ వెళ్తోంది. కానీ కొంచెం లావుగా కనిపించడంతో బరువు తగ్గేందుకు ఆమె ఒజెంపిక్‌ లాంటి ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ నెట్టింట చర్చ జరిగింది. దీనిపై తాజాగా ఆమె స్పందించింది.

Read Also : Payal Rajput : శృంగారం గురించి చెప్పడానికి సిగ్గెందుకు.. బోల్డ్ హీరోయిన్ కామెంట్స్

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆమె స్పందిస్తూ.. నా బరువు గురించి నాకు తెలుసు. నేను గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలా ఉండేందుకే ట్రై చేస్తాను. అమ్మాయిల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి బాడీలో ఛేంజెస్ వస్తాయి. కాబట్టి ఎప్పుడూ ఒకే షేపులో కనిపించడం కష్టం. ఈ మాత్రం దానికే ఇష్టం వచ్చినట్టు ఏవేవో రాసేస్తున్నారు అంటూ తెలిపింది తమన్నా. ఈ కామెంట్లతో తన మీద వస్తున్న రూమర్లు అన్నీ ఫేక్ అని కొట్టి పారేసింది ఈ మిల్కీ బ్యూటీ.

Read Also : Charan – Vanga: చరణ్ – సందీప్ వంగా.. అరాచకం లోడింగ్

Exit mobile version