సినిమాల్లో మాత్రమే కాదు, ఫైనాన్స్ ప్రపంచంలోనూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ మిల్కీ బ్యూటీ, గ్లామర్‌తో పాటు తన ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది హీరోయిన్లు సినిమా రేమ్యునరేషన్‌పైనే ఆధారపడుతుంటే, తమన్నా మాత్రం ఆ డబ్బుని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ తన భవిష్యత్తును సురక్షితం చేసుకుని. ఇప్పుడు నిజమైన బిజినెస్ ఐకాన్‌గా మారింది.
Also Read : Kantara Chapter 1 : ఇంత తొందరగా “కాంతార చాప్టర్ 1” ఓటీటీ రిలీజ్‌కి.. ఆ ఒప్పందమే కారణామ..?
ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం, 2023లో ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.111 కోట్లుగా ఉండగా, 2024 నాటికి అది రూ.120 కోట్లకు చేరుకుంది. అంటే ఒక్క సంవత్సరంలోనే దాదాపు రూ.10 కోట్లు పెరిగిందని చెబుతున్నారు. ఈ పెరుగుదలకి ప్రధాన కారణం ఆమె సినిమాలు మరియు కొత్త బ్రాండ్ డీల్స్‌తో ఈ రేంజ్‌లో సంపాదించింది. ‘సికందర్ కా ముకద్దర్’, ‘ఆఖరీ సచ్’, ‘అరణ్మనై 4’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్స్ కావడంతో ఆమె మార్కెట్ విలువ మరింత పెరిగింది.
అయితే తమన్నా ఫైనాన్షియల్ సక్సెస్‌లో కీలకమైన భాగం ఆమె రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటా. అంతే కాదు ముంబైలోని వెర్సోవాలో ఉన్న బే వ్యూ అపార్ట్‌మెంట్స్‌లో 14వ ఫ్లోర్‌లో ఆమెకు ఒక లగ్జరీ హోమ్ ఉందట. అదేవిధంగా అంధేరి వెస్ట్, లోఖండ్‌వాలా ప్రాంతాల్లో మరో మూడు లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఆమె కొనుగోలు చేసింది. వాటి విలువ దాదాపు రూ.7.84 కోట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తం 2,595 చదరపు అడుగుల ఈ ప్రాపర్టీలకు ఆమె రూ.4.7 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. మొత్తనికి సినిమా కెరీర్‌తో పాటు రియల్ ఎస్టేట్, బ్రాండ్, ఈవెంట్స్, సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా కూడా తమన్నా భారీగా సంపాదిస్తోంది. సినిమా ఫేమ్‌ని కేవలం స్టార్‌డమ్‌కే పరిమితం చేయకుండా, భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవడంలో ఆమె చూపిన తెలివితేటలు చాలా మందికి ప్రేరణ గా మారాయి.