Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhari: ఒక కథను రాయడానికి రచయిత నెలల తరబడి శ్రమిస్తాడు. ఆ కథకు పేరు పెట్టి, దాన్ని రిజిస్టర్ చేయించి, నిర్మాతల తలుపులు తట్టి, తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. కానీ అదే కథను పోలిన సినిమా ఒకరోజు భారీ బ్యానర్లో ప్రకటిస్తే.. తన ఆలోచనను ఎవరో తీసుకున్నారనే అనుమానం కలిగితే? ఇప్పుడు తాప్సీ పన్నూ నటిస్తున్న ‘గాంధారి’ (Gandhari) చుట్టూ నెలకొన్న వివాదం సరిగ్గా ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న ‘గాంధారి’లో తాప్సీ పన్నూ ఒక తల్లి పాత్రలో కనిపించనున్నారు. తన కుమార్తె కిడ్నాప్‌కు గురైన తర్వాత ఆమెను వెతుక్కుంటూ ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లే తల్లి చుట్టూ కథ సాగుతుందని ఇప్పటికే వెల్లడైంది. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న ఈ కథలో మహాభారతంలోని గాంధారి పాత్రకు సంబంధించిన ప్రతీకాత్మక అంశాలు కూడా కనిపించనున్నట్లు ప్రచారం జరిగింది. ‘గాంధారి’ సినిమా సెప్టెంబర్ 3న నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ వేదికగా కూడా విడుదల కానుంది. అయితే ఇదే సమయంలో కథ, కాన్సెప్ట్, టైటిల్ విషయంలో కాపీరైట్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రచయిత కళ్యాణ్ బండి ఈ ఆరోపణలు చేస్తున్నారు. తాను 2019లోనే ‘గాంధారి’ పేరుతో ఒక కథను రాసి, స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేయించుకున్నానని ఆయన చెబుతున్నారు. పిల్లల అక్రమ రవాణా ముఠాలో చిక్కుకున్న తన బిడ్డను రక్షించేందుకు ఒక తల్లి పోరాడే అంశం తన కథలోనూ ఉందని, ప్రస్తుత సినిమాలోని కాన్సెప్ట్‌తో దీనికి గణనీయమైన పోలికలు ఉన్నాయని ఆయన వాదిస్తున్నారు. కళ్యాణ్ చెప్పిన వివరాల ప్రకారం, 2019లో లింక్డ్ఇన్ ద్వారా అప్పట్లో వూట్‌లో పనిచేస్తున్న మోనికా షెర్గిల్‌ను సంప్రదించారు. ఆమెకు 8 పేజీల కథతో పాటు 2 పేజీల సారాంశాన్ని పంపించారు. ఆ కథను పరిశీలించిన అనంతరం, అప్పట్లో సంస్థ వద్ద ఉన్న ప్రాజెక్టులకు అది సరిపోదని తనకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ కథపై తన పని కొనసాగించానని చెప్పారు.
Also Read
- Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
- KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
- Irumudi Movie Controversy : 'ఇరుముడి' సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
ఆ తర్వాత 2023లో హర్మన్ బావేజా స్టూడియోతో తన కథ, స్క్రీన్‌ప్లేపై సుమారు 5 నుంచి 6 నెలల పాటు చర్చలు జరిగాయని కళ్యాణ్ వెల్లడించారు. తన కథను జియో హాట్‌స్టార్‌కు కూడా పంపినట్లు చెప్పారు. అయితే 2025లో నెట్‌ఫ్లిక్స్ ‘గాంధారి’ని ప్రకటించడంతో తన దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడిందని, సినిమా గురించి మరింత సమాచారం సేకరించి తన కథతో పోల్చిన తర్వాత అనేక సారూప్యతలు కనిపించాయని ఆయన ఆరోపించారు. ఇక ఈ వివాదంలో సినిమా టైటిల్ కూడా కీలకంగా మారింది. ‘గాంధారి’ అనే పేరును తన కథ కాన్సెప్ట్ ఆధారంగానే ఎంచుకున్నానని కళ్యాణ్ చెబుతున్నారు. తన కథకు తగిన గుర్తింపు, క్రెడిట్ ఇవ్వాలని కోరుతున్నారు. కథను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ న్యాయపరమైన నోటీసు పంపినట్లు కూడా ఆయన వెల్లడించారు. అందులో ఆర్థిక నష్టం, ప్రతిష్టకు భంగం, మానసిక వేదన, న్యాయ ఖర్చుల కోసం సుమారు రూ.40 లక్షల పరిహారం కోరినట్లు తెలుస్తోంది. అయితే డబ్బు కంటే తన ఆలోచనకు గుర్తింపు రావడమే తనకు ముఖ్యమని ఆయన చెబుతున్నారు.
అయితే కళ్యాణ్ బండి ఆరోపణలకు ‘కథా పిక్చర్స్’ గట్టిగా స్పందించింది. ‘గాంధారి’ పూర్తిగా ఒరిజినల్ సినిమా అని, కథ, స్క్రీన్‌ప్లే రచయిత్రి, నిర్మాత కనికా ధిల్లాన్ స్వయంగా రాశారని సంస్థ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో, కొన్ని మీడియా కథనాల్లో వస్తున్న కాపీ ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది. సినిమా విడుదలకు ముందే మొదలైన ఈ కాపీరైట్ వివాదం ఇప్పుడు ‘గాంధారి’పై ఆసక్తిని మరింత పెంచింది. నిజంగా రెండు కథల మధ్య ఎంతవరకు సారూప్యత ఉంది? టైటిల్ విషయంలో ఎవరి వాదన నిజం ? రచయిత ఆరోపణలకు మరిన్ని ఆధారాలు బయటకు వస్తాయా? లేక చిత్రబృందం చెబుతున్నట్లుగానే ఇది పూర్తిగా స్వతంత్రంగా రూపొందిన కథేనా? ఈ ప్రశ్నలకు స్పష్టత రావాల్సి ఉంది. అప్పటివరకు ‘గాంధారి’ చుట్టూ వినిపిస్తున్నవి ఆరోపణలుగా మాత్రమే చూడాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!