Taapsee Pannu: నేను అయితే అనిమల్ లో నటించేదాన్ని కాదు.. అది అసలు సినిమానా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన బ్యూటీ తాప్సీ. సొట్టబుగ్గలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ఈ భామ స్టార్ హీరోలతో నటించింది కానీ, అంతగా విజయాలను అందుకోలేదు. దీంతో తాప్సీ.. టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ మంచి విజయాలను అందుకుంది. అంతేనా.. ఫైర్ బ్రాండ్ కంగనాతో వివాదానికి కూడా దిగింది. దీంతో మరింత ఫేమస్ అయ్యింది. కాస్తా తీరిక చిక్కినప్పుడల్లా.. ఈ చిన్నది వివాదాలను ఏరికోరి తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా తాప్సీ అనిమల్ సినిమాపై పడింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ భారీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది.డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ మూవీ సుమారు రూ.910 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది.
యానిమల్ మూవీ జనవరి 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో దుమ్మురేపిన యానిమల్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇక ఓటిటీలోకి వచ్చాకా ఈ సినిమాపై చాలామంది సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా వారి లిస్ట్ లోకి తాప్సీ కూడా వచ్చి చేరింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” అనిమల్ ఒక సినిమానా.. ?.. అసలు ఈ సినిమాలో నటీనటులు ఎలా నటించారు. : నేను అయితే అనిమల్ లో నటించేదాన్ని కాదు.. ఇండస్ట్రీలో ఉన్న నటీనటులకు చాలా పవర్ ఉంటుంది. వాళ్ళు చేసే ఏ సినిమా అయినా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాగని యానిమల్ తరహా చిత్రాల్లో నటించే.. ఇతర తారలు ఇలాంటివీ పట్టించుకుంటే బాగుంటుందని నేను చెప్పలేను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!