Sye Surya Reveals Murder Case Details: ఆ నలుగురు సినిమాతో పాటు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన పింగ్ పాంగ్ సూర్య అనే నటుడు పాత్ర కూడా పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో ఉన్నట్లుగా తెలంగాణ పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డికి పింగ్ పాంగ్ సూర్యకు మంచి స్నేహం ఉందని అప్పట్లో పోలీసులు భావించారు. ఇక ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని సూర్య గతంలో వెల్లడించారు కానీ ఇప్పుడు తాజాగా ఒక యేట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగింది? అనే విషయాన్ని కూలంకషంగా వెల్లడించారు. నేను కలియుగ అనే సినిమాను నిర్మించా, రిలీజ్ చేసే సమయానికి నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి. ఏమీ చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి అనే చిన్నపాటి ఫైనాన్షియర్ ను పరిచయం చేసారు.
Bhakta Kannappa: న్యూజీలాండ్ లో ప్రభాస్ vs మంచు విష్ణు.. మాస్ యాక్షన్ ఎపిసోడ్ లోడింగ్
ఆయనకు సినిమా చూపించి ఫైనాన్స్ అడిగాను, అయితే మర్డర్ కి గురైన చిగురుపాటి జయరాం అనే వ్యక్తిని మర్డర్ ముందు రోజు నేనే ఫోన్ చేసి కలిశాను. దీంతో నాకు కూడా ఈ మర్డర్ లో భాగం ఉందని ప్రచారం మొదలైంది. మామూలు మనుషులతో పోలిస్తే సినిమా వాళ్ళ పేరు ఉంటే ఇంకొంచెం వ్యూస్ వస్తాయని ముందు నా పేరు ఎక్కువ ప్రచారం చేసారని సూర్య చెప్పుకొచ్చాడు. నిజంగా నేను ఈ హత్యలో భాగస్వామినా కాదా? అనేది పోలీసులు తేల్చారు. కానీ ఈలోపే నా పేరు నాశనం అయ్యేంతలా మీడియా హైలైట్ చేసిందని వాపోయాడు. నటుడిగా ఎన్నో సినిమాలు చేశాను, ఇంకా ఏదైనా చేయాలని భావించి కలియుగ అనే సినిమా చేశాను అని అన్నారు. దిశ ఘటన తరువాత ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశానని సూర్య చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా కోసం ఇల్లు కూడా అమ్మేశానని సూర్య చెప్పుకొచ్చారు.